- విద్యార్థిని మృతిపై గవర్నర్ దిగ్భ్రాంతి
ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దాండియా వేడుకల సందర్భంగా లైటింగ్ స్టాండ్ కూలిన ఘటనలో గాయపడిన 9 మందిని మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని నారాయణదాసు సోనా మృతదేహానికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం పూర్తి చేశారు.
సోనా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కాలేజీ యాజమాన్యం హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఆమె చెల్లెలు మీనా వైద్య విద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని తెలిపినట్టు సమాచారం. ఈ ఘటనపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ, సోనా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కాలేజీల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని స్పష్టం చేశారు.
